26 February 2012

వివాదంలో షారూఖ్ మన్నత్: సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ముంబైలోని మన్నత్ భవనం వివాదాల్లో చిక్కుకుంది. తన కలల భవనం మన్నత్ నిర్మాణంలో షారూఖ్ నిబంధనలను ఉల్లంఘించడాని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మన్నత్ నిర్మాణంలో పురావస్తు చట్టాలను, తీర నియంత్రణ జోన్ నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఇదే విషయంపై దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబై హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో సింప్రీత్ సింగ్, అమిత్ మారౌంద్ సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ముంబై కోర్టు ఇచ్చిన తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రచారం కోసం పిటిషన్ వేశారంటూ వారిద్దరి పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడమే కాకుండా వారికి 20 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. నిబంధనలను ఉల్లంఘించలేదని, మున్సిపల్ సంస్థ అనుమతుల ప్రకారమే భవన నిర్మాణం జరిగిందని షారూఖ్ ఖాన్ అన్నారు.

read more : http://telugu.oneindia.in/news/2012/02/26/india-controversy-over-srk-bungalow-plea-filed-sc-aid0070.html

No comments:

Post a Comment

Categories