న్యూఢిల్లీ: దాదా సౌరవ్ గంగూలీ లేకుండా కోల్‍కత నైట్ రైడర్స్ జట్టు బాగా ఆడుతోందని ఆ జట్టు యజమాని, బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ అన్నారు. ఆదివారం తమ జట్టుతో జరిగే పూణే వారియర్స్ జట్టు ఆడుతోందని, ఆ పూణే వారియర్స్ తరఫున ఆడుతున్న గంగూలీకి అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. గంగూలీ తమ జట్టులోకి తిరిగి రావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
గత మూడు ఐపియల్‌లో తమ జట్టు ఆటతీరు బాగా లేకపోవడంతో జట్టును మార్చాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. తమ జట్టుకు సలహాలు అందించాలని గంగూలీని అడిగానని, అందుకు గంగూలీ నిరాకరించాడని ఆయన చెప్పారు. గత మూడు ఐపియల్‌ల్లో గంగూలీ కోల్‌కోత నైట్ రైడర్స్ జట్టులో ఉన్నాడు. రెండు సార్లు కెప్టెన్సీ నిర్వహించాడు. గత జనవరిలో జరిగిన వేలంలో గంగూలీ అసలు అమ్ముడే పోలేదు.

No comments:
Post a Comment